ఐపీఎల్ కారణంగా అలసిపోతున్న, గాయపడిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉంది. త్వరలో కీలక ఇంగ్లండ్ పర్యటన, టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ ముగియగానే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్…
టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు ఇటీవల వరుస పరాజయాలను చవిచూస్తోంది. చివరకు బలహీన జట్లపైనా ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. గత 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. టెస్ట్ జట్టుకు కొత్త కోచ్‌ను నియమించింది. ఈ మేరకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు, స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్‌ను కోచ్‌గా అపాయింట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొద్దిరోజులుగా…
ఐపీఎల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 91పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ల దెబ్బకు 17.4 ఓవర్లలో ఢిల్లీ 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. వార్నర్ (19), శ్రీకర్ భరత్ (8), మిచెల్…
ఐపీఎల్లో శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్ జాస్ బట్లర్(30) మంచి సహకారం అందించాడు.…
ఇటీవల గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ మైదానంలో తన విశ్వరూపం చూపించాడు. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు 64 బంతుల్లోనే సెంచరీ చేసి తనలోని సత్తాను బయటపెట్టాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు, ఫోర్ సాధించాడు. దీంతో…
క్రికెట్ ఆటపై వున్న క్రేజ్ నేపథ్యంలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ రాజ్యమేలుతోంది. కోట్లాదిరూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చీకటి వ్యాపారం సాగుతూ వుంటుంది. తాజాగా క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ ల కు అండగా ఉన్నాడు అమిత్ గుజరాతి.ఇతర రాష్ట్రంలో అమిత్ గుజరాతిని వల పన్ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. అమిత్ గుజరాతిని పీటీ వారెంట్ మీద హైదరాబాద్ కు తీసుకొని రానున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా క్రికెట్…
ఐపీఎల్ 2022లో కోల్ కతాకు రిలీఫ్ లభించింది. వరుసగా ఎదురైన పరాజయాలకు బ్రేక్ పడింది. ఐదు వరుస పరాజయాల తర్వాత ఆ జట్టును గెలుపు వరించింది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో విజయాన్ని నమోదుచేసుకుంది. తొలుత రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపు బావుటా ఎగరేసింది. తొలుత…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(88) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో బ్రావో రెండు,…
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. కాన్వే న్యూజిలాండ్ క్రికెటర్ అయినా అతడి సొంత దేశం దక్షిణాఫ్రికా. అక్కడే పుట్టి పెరిగాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ మాత్రం న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్‌గా కాన్వే రాణిస్తుండటంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ.కోటికి కోనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన…
ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైంది అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం అయ్యింది. కోహ్లీ ప్రదర్శన చూసి అతడి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు, ఎలా ఉండే…