England Cricketer Ben Stokes Emotional at His Last Match.
ఇటీవల ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. గత రాత్రి తన సొంత నగరమైన డర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ తో ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు స్టోక్స్. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్లో భావోద్వేగానికి గురయ్యాడు. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా కొద్దిసేపు జట్టును నడిపించే అవకాశం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్టోక్స్ కు ఇచ్చి గౌరవించింది. అయితే తోటి ఆటగాళ్లతో కలిసి పిచ్ దగ్గరకు వచ్చినప్పుడు స్టోక్స్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, ఈ మ్యాచ్ లో స్టోక్స్ లో దురదృష్టం వెంటాడి.. బ్యాటింగ్ లో తను కేవలం ఐదు పరుగులకే ఔటవగా.. ఇంగ్లండ్ 62 పరుగుల తేడాతో పరాజయం పొందింది. దాంతో, స్టోక్స్ ఓటమితో వన్డేలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింనట్లైంది. ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రాసీ వాన్ (133) సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఐడెన్ మార్ క్రమ్ (77), జానేమన్ మలన్ (57) అర్ధ శతకలతో రాణించి జట్టుకు భారీ స్కోరుకు సహకరించారు.
Electric Scooter : రయ్..రయ్.. హైస్పీడ్ ఈ స్కూటర్లు వచ్చేశాయ్..
దాంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులు భారీ స్కోర్‌ను ఇంగ్లండ్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లు 46.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 271 పరుగులకు ఘోర పరాజయం పొందింది. ఓపెనర్లు జేసన్ రాయ్(43), జానీ బెయిర్ స్టో(63), జో రూట్ (86) రాణించిన జట్టు విజయం సాధించలేకపోయింది. బెన్ స్టోక్స్(5), జోస్ బట్లర్(12) నిరాశ పరుచగా.. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్ 8.5 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.