డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. భారత…
డబ్లిన్ వేదికగా జరుగుతున్న భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం సృష్టించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈరోజు తొలి టీ20, మంగళవారం రెండో టీ20 జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్…
దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ జట్టు సొంతం చేసుకుంది. 2021-22 సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచి చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 269 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప…
శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా మహిళలు 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. శనివారం దంబుల్లా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ అలవోకగా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మేరకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్ ఆటపట్టు…
ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెండుగా చీలిపోయింది. ఒకే సమయంలో వివిధ సిరీస్‌లు ఉండటంతో సెలక్టర్లు సీనియర్, జూనియర్ జట్లను వేర్వేరుగా ప్రకటించారు. సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో ఉండగా.. జూనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు…
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్…
లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం…
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ షాట్ ఆడగా అది అవతలి ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. చేసేందేమీ లేక న్యూజిలాండ్ ఆటగాడు నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ అవుట్ పట్ల ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా కాసేపు అయోమయంలోనే ఉండిపోయాడు. హెన్రీ నికోల్స్ ఎలా…
ఇప్పటివరకు రుమేలీ ధర్ ఇండియా తరఫున 78 వన్డేలు ఆడి 961 పరుగులు చేసింది. అటు 18 టీ20లు ఆడి 131 పరుగులు సాధించింది. టెస్ట్ కెరీర్లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడింది. నాలుగు టెస్టుల్లో రుమేలీ ధర్ 236 పరుగులు చేసింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ నాలుగు మ్యాచ్‌లు ముగియగా.. చెరో రెండు విజయాలతో ఇరు జట్లు సిరీస్‌ని సమం చేశారు. ఇప్పుడు ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇరు జట్లకి ఇది తాడోపేడో మ్యాచ్! ఎవరు గెలుస్తారో, వారికే సిరీస్ దక్కుతుంది. మొదట్లో భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, దక్షిణాఫ్రికా సునాయాసంగా ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. తొలి మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ని…