ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ జోరు చూపించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టిన టీమిండియా 109 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. పాకిస్థాన్ ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ 128 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్ కోల్పోయినా 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అటు 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో, 99 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆరోస్థానంలో ఉంది. బంగ్లాదేశ్(98) ఏడోస్థానంలో, శ్రీలంక(92) 8వ స్థానంలో కొనసాగుతున్నాయి.
Read Also: Gold Coins: బాత్రూమ్ కోసం తవ్వితే.. గోల్డ్ కాయిన్స్ బయటపడ్డాయి
కాగా సిరీస్ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో రిషబ్ పంత్ అజేయ శతకంతో మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు. ఏకైక టెస్టులోనూ పంత్ సెంచరీ చేసినా టీమిండియా అనూహ్యంగా ఓడిపోవడంతో పంత్ సెంచరీ మరుగున పడిపోయింది. అయితే మూడో వన్డేలో కష్టసమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వన్డే కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా భవిష్యత్తు రిషబ్ పంతేనని, అతడు సూపర్ ఫినిషర్ అని సురేష్ రైనా ట్వీట్ చేశాడు. అటు తీవ్ర ఒత్తిడిలో పంత్ చేసిన సెంచరీ గొప్పదని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. పంత్ గొప్ప ఆటగాడని, చాలా స్మార్ట్‌గా బ్యాటింగ్ చేశాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసించాడు.