2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ…
ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో రబాడ (15) 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో పంజాబ్ ఆ మాత్రం…
గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు దీపక్ హుడాను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటివరకు మలింగ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రావో 171 వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి తర్వాత స్థానంలో ఉన్న మలింగ…
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (50) మెరుపు బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అతడు అవుటైనా శివమ్ దూబె (49) కూడా దూకుడుగా ఆడాడు. అయితే తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. దూబె 30…
ఐపీఎల్లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి…
బుధవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. సాధించింది తక్కువ పరుగులే అయినా కోల్‌కతా బాగానే పోరాడింది. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. అయితే బ్యాటింగ్ విభాగం నిరాశపరిచిందని కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వివరించాడు. బెంగళూరు బౌలర్ హసరంగాను ఆడటంతో తాము పొరపాటు చేశామని పేర్కొన్నాడు. అతడి ఆఫ్ స్పిన్‌ను ఆటడంలో ప్రణాళికలు అమలు చేయడంలో తమ బ్యాట్స్‌మెన్ విఫలమై…
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ -2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బాట్స్‌తో తొలుత బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్…
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ ఆరోపణలు చేశాడు. తాను ఆర్సీబీ టీమ్‌లో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో తాను ఆర్సీబీని వీడి మరో…