IND Vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్టునే మూడో వన్డేలో టీమిండియా కొనసాగించింది. అటు న్యూజిలాండ్ మాత్రం ఓ మార్పు చేసింది. రెండో వన్డేలో ఆడిన బ్రాస్వెల్ను పక్కనపెట్టి ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరి గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ…
Team India: ప్రస్తుతం టీమిండియాలో ఫామ్‌లో లేని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు రిషబ్ పంత్. అతడు పదే పదే విఫలమవుతున్నా అవకాశాలు మాత్రం ఇంకా ఇస్తున్నారు. ఒకానొక సమయంలో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అనేక అవకాశాలు ఇస్తున్నా అతడి ఆటతీరులో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పంత్ ఆటతీరుపై స్పందించారు. ‘ఎన్నడా…
Ruturaj Gaikwad: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సైతం బద్దలు కొట్టాడు. యువరాజ్ కేవలం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే రుతురాజ్ మాత్రం 7 బంతుల్లో ఏడు సిక్సర్లు బాదాడు. మధ్యలో ఓ నోబాల్ పడటంతో ఒకే ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లో…
Guinness Record: ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ మరే లీగ్‌కు ఉండదు. తాజాగా ఐపీఎల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది మే నెలలో ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరు కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022…
Team India: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షార్పణం అయినా ఈ వన్డేలో టీమిండియా జట్టు ఎంపిక పలు విమర్శలకు తావిచ్చింది. తొలి వన్డేలో 36 పరుగులతో రాణించిన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం టీమిండియాను దెబ్బతీసిందని.. అందుకే రెండో వన్డేలో దీపక్ హుడాను తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వివరణ ఇచ్చాడు. అయితే పదే పదే విఫలమవుతున్న…
Tim Southee: న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెట్లో ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని రీతిలో అతడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ధావన్ వికెట్ తీసిన వెంటనే సౌథీ ఈ రికార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు, వన్డేల్లో 200 వికెట్లు, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు సౌథీ టెస్టుల్లో 347 వికెట్లు, వన్డేల్లో…
Team India: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కెరీర్ చరమాంకం దశకు చేరుకుంది. అతడు మహా అయితే మరో రెండేళ్లు మాత్రమే పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతాడన్న అంచనాలు ఉన్నాయి. ఈ అంశంపై వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత క్లారిటీ రానుంది. అయితే సచిన్ ఉండగానే అలాంటి ఆటగాడు కోహ్లీ రూపంలో భారత్‌కు దొరికాడు. సచిన్, ధోనీ తర్వాత అంతటి స్థాయిలో కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ చివరిదశకు…
Shardul Thakur: టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఒక్క ఓవర్‌తో టీమిండియా నుంచి మ్యాచ్‌ను అతడు దూరం చేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ ఐదు బౌండరీలతో 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో తొలి బంతిని టామ్ లాథమ్ డీప్ బ్యాక్వార్డ్ దిశగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని వైడ్ వేయగా.. ఎక్స్ట్రా బాల్‌ను బౌండరీ తరలించాడు.…
Manish Pandey: బీసీసీఐపై టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌లో సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐపై తీవ్ర విమర్శలు రాగా మనీష్ పాండే కూడా అభిమానులకు మద్దతు పలికాడు. గతంలో పదే పదే తనను రిజర్వుబెంచ్పై కూర్చోబెట్టి తన కెరీర్ నాశనం చేశారని.. ఇప్పుడు సంజు శాంసన్ కెరీర్ కూడా అలాగే చేస్తున్నారని మనీష్ పాండే అన్నాడు. తనను జట్టులోకి ఎంపిక చేయకుండా రిజర్వు…
England: ఈ ప్రపంచంలో పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ హార్డిక్ పాండ్యా పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ కూడా చేరాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. అతడికి కాబోయే భార్య మోలీ కింగ్ తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మేరకు తమ కూతురి…