IND Vs NZ: ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 307 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఒక దశలో న్యూజిలాండ్ ఓటమి ఖాయం అనుకున్నారు అభిమానులు. కానీ అనూహ్యంగా లాథమ్ భారీ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి…
భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇటీవలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి కార్తీక్ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ ఖాతాలో 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ ఖాతాలో 836 పాయింట్లు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్-3 నుంచి కిందకు పడిపోయాడు. గత వారం వరకు మూడో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్‌ను న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్…
Team India: న్యూజిలాండ్ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ టూర్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత జట్టు ఆడనుంది. ఈ పర్యటనకు గతంలో జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. అయితే అతడు బంగ్లాదేశ్ వెళ్లడం ఇప్పుడు అనుమానంగా మారింది. జడేజా గాయంపై సస్పెన్స్ నెలకొంది. ఇంకా అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. దీంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉంటాడని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.…
T20 World Cup: 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీ20 ప్రపంచకప్ 2021, 2022లో క్వాలిఫయింగ్ దశలున్నాయి. కానీ టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్ ఉండదు. అదే సమయంలో సూపర్ 12 కూడా ఉండదు. 2024 ప్రపంచకప్‌లో భారీ మార్పులు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. కొత్త ఫార్మాట్ వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది. అభిమానులకు మజా ఇచ్చే రీతిలో వచ్చే టీ20 ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ కోసం ఏకంగా 20…
Aus Vs Eng: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సిరీస్‌లో ఆడుతోంది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టేనా అని చాలా మందికి అనుమానం వచ్చింది. అంత ఘోరంగా ఈ వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా మూడో వన్డేలో ఇంగ్లండ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.…
IND Vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ గెలవకపోయినా మంచి ప్రదర్శనే చేసింది. ఒక దశలో హ్యాట్రిక్ వికెట్లు సాధించేలా కనిపించింది. అయినా హ్యాట్రిక్ నమోదైంది. అయితే ఈ హ్యాట్రిక్ బౌలర్ ఖాతాలో పడలేదు. టీమిండియా ఖాతాలో పడింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో డారిల్ మిచెల్ పెవిలియన్ బాట పట్టాడు. రెండో బంతిని అర్ష్‌దీప్…
IND Vs NZ: నేపియర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 టైగా ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అయిందని అంపైర్లు ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం స్కోర్లు సమం అయ్యాయని తెలిపారు. తొలుత న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.…
IND Vs NZ: నేపియర్ వేదికగా మెక్లీన్ పార్క్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ సహకారం అందించాడు. అయితే వీళ్లిద్దరూ మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో కివీస్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయ్యింది. అయితే కాన్వే, ఫిలిప్స్ కారణంగా న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.…