Sanjay Bangar: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోహ్లీ చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ సెంచరీలు పూర్తి చేశాడు. ఇది చిన్న విషయం కాదని.. అతడు త్వరలోనే సచిన్‌ను కూడా దాటేస్తాడని బంగర్ వాఖ్యానించాడు. ఈ ఏడాది టీమిండియా 26 నుంచి 27 వన్డే మ్యాచ్‌లను ఆడుతుందని.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ చేరితే అది అదనం అన్నాడు. కాబట్టి ఈ మైలురాయిని ఈ ఏడాదిలోనే కోహ్లీ అందుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బంగర్ అన్నాడు.
Read Also: Nitin Gadkari: 2024నాటికి భారత్లో అమెరికా కంటే బెస్ట్ రోడ్లు
అయితే ఈ ఫీట్ సాధించడం కోహ్లీకి అంత ఈజీ కాదని బంగర్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న కోహ్లీ వంటి ఆటగాళ్లు అడ్జస్ట్ అవడం కష్టమని బంగర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు కాబట్టి ఈ ఫీట్ సాధించాలంటే ఒక్క బంతికి కూడా కాన్సంట్రేషన్ మిస్ కాకూడదన్నాడు. ప్రస్తుతానికి టీ20 మ్యాచ్‌లకు కోహ్లీ బ్రేక్ తీసుకుంటున్నాడని.. వన్డేల్లో అయితే బ్రేకులు తీసుకోవడం కుదరదని తన అభిప్రాయమని బంగర్ అన్నాడు. ఒకవేళ సచిన్ రికార్డు బద్దలు కాకపోయినా అక్కడి వరకు అయితే కోహ్లీ వెళ్లడం ఖాయమని అనుకుంటున్నట్లు చెప్పాడు.