BCCI: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్న 33 శాతం రిజర్వేషన్లు వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇప్పటికే కండక్టర్లు, డ్రైవర్లు, పైలెట్లుగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలుగా పరిమితమైన మగువలకు ప్రస్తుతం ఇలాంటి అవకాశాలు వారిని బయటకు వచ్చేలా చేస్తున్నాయి. దీంతో ఆత్మాభిమానం కోసం ఉద్యోగాలు చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. వారికి ఉన్న రిజర్వేషన్లను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని రంగాల్లోనూ వారి ప్రాతినిధ్యం…
Team India: ఒక స్టార్ క్రికెటర్ పుట్టినరోజు జరుపుకుంటేనే సోషల్ మీడియాలో మాములు హడావిడి ఉండదు. అలాంటిది ఒకేరోజు టీమిండియాకు చెందిన నలుగురు స్టార్ క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటే సోషల్ మీడియాలో జరిగే హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా మంగళవారం అంటే డిసెంబర్ 6వ తేదీన ఏకంగా నలుగురు క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటున్నారు. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, టెస్టు స్పెషలిస్టు కరుణ్…
Team India: వన్డే ఫార్మాట్లో టీమిండియా మంచి జట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలి వన్డేలో చెత్త ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై ఓటమిపాలైంది. దీంతో పలు చెత్త రికార్డులు టీమిండియా ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా నిలిచింది. ఆదివారం నాడు బంగ్లా చేతిలో ఓటమి భారత్‌కు వన్డేల్లో 435వ పరాజయం. ఇప్పటి వరకు భారత జట్టు 1018 వన్డేలు ఆడి 435 మ్యాచుల్లో ఓడింది. భారత్‌తో పాటు…
Shakib Al Hasan: టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అతడు 10 ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబుల్ హసన్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ…
Team India: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఇటీవల పంత్ ఫామ్ దృష్ట్యా అతడిని ఈ సిరీస్ నుంచి దూరం చేస్తారని మొదట్నుంచీ డిస్కషన్ నడుస్తూనే ఉంది. అయితే తొలి వన్డేలో పంత్‌ను పక్కనపెట్టడంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడని, మెడికల్ టీమ్ సూచనలతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ సిరీస్‌కు మాత్రం పంత్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వివరించింది.…
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా కుల్దీప్ సేన్‌ను బరిలోకి దించుతోంది. అటు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టిన టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. Read Also: కుర్రాళ్లకు కేక…
IND Vs BAN: ఇటీవల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఢాకా వేదికగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌తో జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో సీనియర్,…
Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోలుకున్నాడు. శుక్రవారం నాడు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కామెంటరీ చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో పాంటింగ్‌ను ఆసుప్రతికి తరలించారు. దీంతో అతని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందనే వార్తలు రావడంతో మరింత కంగారుపడ్డారు. అయితే ప్రస్తుతం పాంటింగ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం అతడు మళ్లీ మైదానంలోకి దిగి కామెంటరీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్…
Pakistan Cricket Board: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనే విషయంపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. ఇదే జరిగితే ఆసియా కప్ కళ తప్పుతుంది. దీంతో పాకిస్థాన్ బోర్డు బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు దూరంగా ఉంటామని గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను…
Team India: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. చేతి గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. అతడికి దాదాపు రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల నుంచి షమీ తప్పుకున్నట్లు పీటీఐ వెల్లడించింది. Read Also: Andhra Pradesh:…