Kapil Dev: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ఆధారపడి వన్డే ప్రపంచకప్ గెలవలేమని కపిల్ దేవ్ అన్నాడు. ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడితే మెగా టోర్నీలు గెలవలేమని.. కనీసం నలుగురు లేదా ఐదుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచించాలని కపిల్ దేవ్ సూచించాడు. ఒకవేళ కప్ గెలవాలని అనుకుంటే.. కోచ్, సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి జట్టు గురించి ఆలోచించాలని కపిల్ దేవ్ హితవు పలికాడు.
Read Also: Shock : అమ్మాయి కడుపులో అరకేజీ వెంట్రుకలు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్
టీమిండియాలో నమ్మదగ్గ ఆటగాళ్లు ఉన్నారని.. మ్యాచ్ విన్నర్లు కూడా ఉన్నారని కపిల్ దేవ్ అన్నాడు. వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని స్పష్టం చేశాడు. యువ ఆటగాళ్లు ముందుకొచ్చి వరల్డ్ కప్ వేదికపై సత్తా చాటాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ పిలుపునిచ్చాడు. మన జట్టుకు ఎప్పుడూ ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే మూలస్తంభాల్లా ఉంటున్నారని.. జట్టు వారి చుట్టూనే తిరుగుతోందని.. దాన్ని మనం బ్రేక్ చేసి అలాంటి ఐదారుగురు ఆటగాళ్లను తయారు చేసుకోవాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. అందుకే కోహ్లీ, రోహిత్‌లపై ఆధారపడలేమని చెప్తున్నానని.. యువ ఆటగాళ్లు ముందుకొచ్చి ఇది మన టైం అనుకోవాలని కపిల్ సూచించాడు.