IPL 2023: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ రూల్ భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. ఈ రూల్ ప్రకారం ఆట ప్రారంభం కావడానికి ముందే ప్రతి జట్టు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఆడుతున్న 11 మందిలో ఒకరి స్థానంలో ఈ సబ్స్టిట్యూట్లలో ఒకరిని తీసుకోవచ్చు. వాళ్లు కేవలం…
17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ గడ్డపై టెస్టు సిరీస్ ఆడడానికి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది.
ICC Test Championship: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసు రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ పర్యటనలో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ ముందంజ వేసింది. అయితే పాకిస్తాన్‌కు మాత్రం చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే పాకిస్తాన్ ఓడిపోవడంతో టీమిండియా లాభపడింది. ఎందుకంటే టీమిండియా ముందుకు వెళ్లే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్…
BCCI: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారికి ఉన్న 33 శాతం రిజర్వేషన్లు వినియోగించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఇప్పటికే కండక్టర్లు, డ్రైవర్లు, పైలెట్లుగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలుగా పరిమితమైన మగువలకు ప్రస్తుతం ఇలాంటి అవకాశాలు వారిని బయటకు వచ్చేలా చేస్తున్నాయి. దీంతో ఆత్మాభిమానం కోసం ఉద్యోగాలు చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. వారికి ఉన్న రిజర్వేషన్లను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని రంగాల్లోనూ వారి ప్రాతినిధ్యం…
Team India: ఒక స్టార్ క్రికెటర్ పుట్టినరోజు జరుపుకుంటేనే సోషల్ మీడియాలో మాములు హడావిడి ఉండదు. అలాంటిది ఒకేరోజు టీమిండియాకు చెందిన నలుగురు స్టార్ క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటే సోషల్ మీడియాలో జరిగే హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా మంగళవారం అంటే డిసెంబర్ 6వ తేదీన ఏకంగా నలుగురు క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటున్నారు. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, టెస్టు స్పెషలిస్టు కరుణ్…
Team India: వన్డే ఫార్మాట్లో టీమిండియా మంచి జట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలి వన్డేలో చెత్త ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై ఓటమిపాలైంది. దీంతో పలు చెత్త రికార్డులు టీమిండియా ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా నిలిచింది. ఆదివారం నాడు బంగ్లా చేతిలో ఓటమి భారత్‌కు వన్డేల్లో 435వ పరాజయం. ఇప్పటి వరకు భారత జట్టు 1018 వన్డేలు ఆడి 435 మ్యాచుల్లో ఓడింది. భారత్‌తో పాటు…
Shakib Al Hasan: టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అతడు 10 ఓవర్లు వేసి 36 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా షకీబుల్ హసన్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ…
Team India: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఇటీవల పంత్ ఫామ్ దృష్ట్యా అతడిని ఈ సిరీస్ నుంచి దూరం చేస్తారని మొదట్నుంచీ డిస్కషన్ నడుస్తూనే ఉంది. అయితే తొలి వన్డేలో పంత్‌ను పక్కనపెట్టడంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడని, మెడికల్ టీమ్ సూచనలతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ సిరీస్‌కు మాత్రం పంత్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వివరించింది.…
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా కుల్దీప్ సేన్‌ను బరిలోకి దించుతోంది. అటు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టిన టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. Read Also: కుర్రాళ్లకు కేక…