Team India: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లను ఎంపిక చేయగా ఇప్పుడు వీరితో బుమ్రా కూడా చేరనున్నాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన బుమ్రా.. వెన్నుకు సంబంధించిన స్ట్రెస్ రియాక్షన్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అనంతరం టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరంగా ఉన్నాడు. దీంతో చికిత్స తీసుకున్న తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ ఫిట్‌నెస్ సాధించడంతో తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.
Read Also: Ola Scooters: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
కాగా భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జనవరి 10 గౌహతిలో జరగనుంది. రెండో వన్డే జనవరి 12న కోల్‌కతాలో, మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుమ్రా రాక.. టీమిండియాకు కచ్చితంగా బలాన్నిస్తోంది. 2022లో వెన్ను సమస్య కారణంగానే బుమ్రా ఆసియా కప్ ఆడలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పేరును సైతం బీసీసీఐ చేర్చింది. టోర్నీ ప్రారంభం నాటికి అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించినప్పటికీ.. బుమ్రా కోలేకోలేదు. దీంతో బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని టీ20 వరల్డ్ కప్‌కు సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.