IND Vs SL: కొత్త ఏడాదిలో టీమిండియా తన ప్రయాణం మొదలు పెట్టబోతోంది. స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. పలువురు కొత్త ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శివం మావి, శుభ్‌మన్ గిల్ టీ20లలోకి అడుగుపెట్టబోతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో శివం మావికి అవకాశం కల్పించారు.
Read Also: Off The Record: తగ్గేది లేదంటున్న తోపుదుర్తి, పరిటాల శ్రీరాం
గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా నిష్క్రమణ తర్వాత.. పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లతో ముందుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఈ మేరకు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లను శ్రీలంక టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వీళ్ల స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. యువ ఆటగాళ్లతో టీమిండియా ఎలాంటి ఫలితం రాబడుతుందో ఈ సిరీస్‌లో వేచి చూడాలి.
టీమిండియా తుది జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, చాహల్
శ్రీలంక తుది జట్టు: దాసున్ షనాక (కెప్టెన్), నిశాంక, కుశాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వ, చరిత్ అసలంక, భనుక రాజపక్స, హసరంగ, చమికా కరుణరత్నె, మహీష్ తీక్షణ, దిల్షాన్ మధుశంక, కాసున్ రజిత