Team India: కొత్త ఏడాదిలో టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కాబోతోంది. శ్రీలంకతో టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముంబై వేదికగా తొలి టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఫెంటాస్టిక్ ఫైవ్ సిద్ధమని ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో చాహల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ ఉన్నారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టు బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
Read Also: Sridhar Reddy: తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
కాగా మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 ముంబైలో, రెండో టీ20 ఈనెల 5న పూణె వేదికగా, మూడో టీ20 ఈనెల 7న రాజ్‌కోట్ వేదికగా జరగనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, శ్రీలంక జట్లు ముంబై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. సోమవారమే టీమిండియా ఆటగాళ్లంతా ముంబై చేరుకోగా మంగళవారం జోరుగా ప్రాక్టీస్ చేశారు. యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ నెట్స్‌లో చెమటోడ్చారు. అనంతరం కొత్త స్పాన్సర్ ఎంపీఎల్ జెర్సీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.
Fantastic five 😎
All set for the T20I series 🇮🇳#TeamIndia | #INDvSL pic.twitter.com/pAWq28wkF7— Yuzvendra Chahal (@yuzi_chahal) January 2, 2023