Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును విమర్శించే క్రమంలో, ఏ మాత్రం సంబంధంలేని ఐశ్వర్యా రాయ్ గురించి ప్రస్తావించాడు.
చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికైంది. దాయాది జట్లు ఈ మ్యాచ్లో గెలుపు కోసం పోరులో తలపడనున్నారు.
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరోసారి గుర్తు చేసే విధంగా సూపర్ ఓవర్ లో ఓ మ్యాచ్ ను రింకూ సింగ్ ఫినిష్ చేశాడు.
పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తారని అందరు అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినా.. కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మొగ్గుచూపినట్లు మ్యాచ్ ను వీక్షేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాలేదనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఆసియా కప్ నేడు ( బుధవారం ) స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్లో పాకిస్తాన్తో నేపాల్ జట్టు తలపడుతుంది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు నేపాల్ బౌలర్లు వరుస షాక్స్ ఇచ్చారు.
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ టీమ్ టెస్ట్ సారథి, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మింట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు ఇవాళ (మంగళవారం) శ్రీలంక క్రికెట్కు తెలిపాడు.
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవెన్ ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్కు రిటైర్మింట్ ప్రకటించాడు.