వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారాను ఎంపిక చేయలేదు. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై బీసీసీఐ వేటు వేసింది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ ఓ స్టన్నింగ్ ఫీట్ చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. టీ20 క్రికెట్ లో ఈ అద్భుతమై ఘటన చోటుచేసుకుంది.
అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు చెప్పాడు. డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్.. ఈ విజయానికి వారు అర్హులు.. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు.. ఎందుకంటే జట్టులోకి ఎంత కష్టపడినా 11 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది అని అన్నాడు.
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ర్యాంకింగ్స్‌లో పడిపోయిన మాజీ చాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈసారి క్వాలిఫయర్స్ ద్వారా ప్రధాన టోర్నీకి ముందడుగు వేయాల్సి ఉంటుంది. వచ్చేనెల ( జూన్ ) 18 నుంచి జూలై 9 వరకు జింబాబ్వేలో క్వాలిఫయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది.
ఐపీఎల్ 16వ సీజన్ లో మంగళవారం ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది.
ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కంటే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.