WPL 2025: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించింది. దీంతో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది.
Read Also: America : అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం.. ఈ సారి ఎంతమంది వచ్చారంటే ?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీని ఫలితంగా ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయినా.. చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. ముంబై కెప్టెన్ ఈ కీలక ఓవర్‌ను ఎస్ సంజనకు అప్పగించగా.. మొదటి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ కొట్టింది. ఆపై రెండో బంతికి రెండు పరుగులు వచ్చాయి. మూడు, నాలుగు బంతులకు ఒక్కో పరుగు రావడంతో మ్యాచ్ మరింతగా ఉత్కంఠభరితంగా మారింది. ఐదో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నిక్కీ ప్రసాద్ వికెట్ కోల్పోయింది. దానితో ఒక బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఆఖరి బంతికి అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడి రెండు పరుగులు పూర్తి చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దీనితో ముంబై ఇండియన్స్ అనూహ్యమైన ఓటమిని మూటగట్టుకుంది.
Read Also: Caste Census: సర్వే పూర్తి చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం
📁 #TATAWPL
↳ 📂 Last Over Classic@DelhiCapitals hold their nerves and win on the very last ball of the match 🔥👏Scorecard ▶ https://t.co/99qqGTKYHu#MIvDC pic.twitter.com/rvxAdfrlUr
— Women's Premier League (WPL) (@wplt20) February 15, 2025
ముంబై ఇండియన్స్ టీంలో నాట్ స్కివేర్-బృంట్ 80 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 42 పరుగులు మినహాయించి మిగితావారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అన్నాబెల్ సుతేర్లాండ్ 3 వికెట్లతో సత్తా చాటింది. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఓపెనింగ్ లభించింది. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ ఉమెన్ షఫాలీ వర్మ తండిన శైలిలో రెచ్చిపోయింది. 18 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులతో మెరిసింది. ఆ తర్వాత నికి ప్రసాద్ 35 పరుగులతో రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో విజయం అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో ప్రతిభ చాటిన నికి ప్రసాద్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అందుకుంది.