పాకిస్తాన్‌లో ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ తమ అనుభవం లేని పేసర్లతో ఆకట్టుకుందని.. వీరి ఫామ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా కొనసాగుతుందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫ్రీలో ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఆడటం లేదు. ఈ పరిస్థితుల్లో విల్ ఓ’రూర్కే, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, మాట్ హెన్రీ వంటి పేసర్లపై న్యూజిలాండ్ ఆశలు ఉన్నాయని టిమ్ సౌథీ చెప్పారు.
Read Also: IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్ డేట్.. కాసేపట్లో షెడ్యూల్
“ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లపై బాధ్యత ఉంది. ఈ టోర్నమెంట్లలో భాగంగా ఉండడం చాలా ముఖ్యం. వారి ప్రదర్శన పట్ల నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను” అని సౌథీ తెలిపారు. అలాగే.. జట్టులో సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో కలిసి ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు “ఈ ట్రై-సిరీస్ లో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి టోర్నమెంట్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది” అని సౌథీ అన్నారు. “న్యూజిలాండ్ ఎప్పుడూ ఐసీసీ ఈవెంట్లలో పటిష్టంగా ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నమెంట్‌లో కొంచెం బాగా రాణిస్తే, ఏదైనా జరగవచ్చు. బ్లాక్ క్యాప్స్ ఈసారి ట్రోఫీని ఎత్తాలని నేను కోరుకుంటున్నాను,” అని సౌథీ వ్యాఖ్యానించారు. కాగా.. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన 36 ఏళ్ల సౌథీ, న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 776 వికెట్లు పడగొట్టాడు.
Read Also: AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసే ఛాన్స్..!
కాగా.. మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు ఫిబ్రవరి 19న కరాచీలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారాన్ని ప్రారంభించనున్నది. న్యూజిలాండ్ జట్టు రెండవసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచేందుకు.. టోర్నమెంట్‌లో తమ సత్తాను చాటాలని చూస్తోంది. 2017లో న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారతదేశం, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి.