పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ పై పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని రషీద్ లతీఫ్ అభివర్ణించారు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రషీద్ లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఈ వ్యాఖ్యలపై వసీం అక్రమ్ స్పందిస్తూ, పాకిస్తాన్ తరఫున దాదాపు 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రషీద్ లతీఫ్.. ఈ వ్యాఖ్యలు చేయడం తనకు బాధగా అనిపించిందని తెలిపాడు. రషీద్ ఖాన్ తన కంటే గొప్ప క్రికెటర్ అని వసీం అక్రమ్ చెప్పాడు.
జియో న్యూస్ టాక్ షో లో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ, “రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రపంచంలో గుర్తింపును పొందేలా చేశాడు. అతను వసీం అక్రమ్ కంటే గొప్పవాడు. ఇది చెప్పడానికి నాకు బాధగా ఉంది, కానీ రషీద్ అతని కంటే పెద్ద క్రికెటర్” అని అన్నాడు. “రషీద్ ఖాన్‌కు నాది ఒక సలహా. మీరు మీ టెస్ట్ జట్టును మెరుగుపరచుకోండి. పాకిస్తాన్‌తో మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడండి” అని రషీద్ లతీఫ్ అన్నాడు.
Read Also: Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు.. కీలక ఆటగాడు ఎంట్రీ
ఫిబ్రవరి 21న కరాచీలో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో ఆఫ్ఘనిస్తాన్ తన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడనుంది. కాగా.. 2023 ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మంచి ప్రదర్శనను కనబరిచింది. ఈసారి కూడా జట్టు నుంచి అదే ఆశిస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అఫ్గానిస్తాన్ జట్టు:
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జాద్రాన్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా (వైస్ కెప్టెన్), అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బాదిన్ నయీబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫరీహ్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, నంగేయాలియా ఖరోటే, నవీద్ జాద్రాన్ మరియు నూర్ అహ్మద్.