భారత టీ20 కెప్టెన్‌గా ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ టీ20లకు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటించడం.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం బాగోలేదని చెప్పడానికి నిదర్శనమన్నాడు. ప్రస్తుతానికి టీమిండియాలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయని.. అందులో ఒకటి ఢిల్లీ గ్రూప్.. రెండోది ముంబై గ్రూప్ అని వ్యాఖ్యలు…
ఐపీఎల్ 2022 మెగా వేలం త్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో వేలానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులకు దిగింది. దీంతో ప్రధాన కోచ్ పేరును మంగళవారం నాడు ప్రకటించింది. ఆర్సీబీ తదుపరి కోచ్‌గా సంజయ్ బంగర్ పనిచేయనున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం వెల్లడించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో సంజయ్ బంగర్ బ్యాటింగ్ కోచ్‌గా ఆర్సీబీ జట్టుకు సేవలు అందించాడు. ఇప్పుడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. వచ్చే రెండు సీజన్ల…
టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. అయితే ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ప్రపంచ కప్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే భారత్ వైఫల్యానికి గల కారణాలపై రవిశాస్త్రి స్పందించాడు. ఆటగాళ్లు కేవలం మనుషులు మాత్రమే అని.. వాళ్లు యంత్రాలు కాదు అని పేర్కొన్నాడు. యంత్రాలలో పెట్రోల్ పోసి నడపొచ్చు.. కానీ మనుషులతో…
టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్‌గా అతడి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Read Also: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరే రికార్డు ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన టాస్ గెలిచి…
టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లకుండానే నిష్క్రమించనుంది. సోమవారం నామమాత్రంగా జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. ఓడినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్ పరాజయాలకు టాస్ కారణమన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. భారత్ ఓటములకు టాస్ ఎంత మాత్రం కారణం కాదన్నారు. మన బ్యాట్స్‌మెన్ వైఫల్యంతోనే జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిందన్నాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్…
టీ20 ప్రపంచకప్‌లో ప్రస్తుతం టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. Read Also: నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష ! అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్…
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి దిగిపోయిన తర్వాత అతడి భవితవ్యం ఏంటనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే రవిశాస్త్రి ముందు ఓ బంపర్ ఆఫర్ నిలిచింది. ఐపీఎల్లో కొత్త జట్టు అయిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రవిశాస్త్రిని తమ హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తోంది. దీనిపై రవిశాస్త్రిని ఫ్రాంచైజీ యాజమాన్యం సంప్రదించినట్లు సమాచారం. Read…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి అయోమయంగా మారింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ జట్టు పసికూనల చేతిలో ఓ మ్యాచ్‌లో ఓడిపోవాలని టీమిండియా అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా ఫైనల్‌కు రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే అక్కడ మరోసారి భారత్‌ను ఓడించాలని భావిస్తున్నామని, దాని కోసం తమకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు ‘మౌకా’ అనే పదం ఎంతమాత్రం…
ఒకవైపు టీ20 ప్రపంచకప్ జరుగుతుండగానే.. మరోవైపు భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమవుతోంది. నవంబర్ 17 నుంచి టీమిండియాతో మూడు టీ20లతో పాటు మూడు టెస్టులను ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టెస్టులకు ప్రధాన బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు సెలక్టర్లు విశాంత్రి ఇచ్చారు. Read Also: వెల్లివిరిసిన మతసామరస్యం.. రాముడికి ముస్లిం మహిళల హారతి టీ20 జట్టు:…
భారత్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్‌తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…