టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా ఘనత అందుకున్న కోహ్లీ తాజాగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న టాస్ గెలిచిన రికార్డును కోహ్లీ అధిగమించాడు.
Read Also: సెంచూరియన్ టెస్టులో పుజారా గోల్డెన్ డకౌట్
47 టెస్టుల్లో భారత్ జట్టుకు సారథ్యం వహించిన అజహరుద్దీన్ 29 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు టాస్ నెగ్గిన 30 టెస్టుల్లో భారత్ 23 టెస్టులు నెగ్గడం విశేషం. కాగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్టు విజయాల్ని సాధించిన కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ముగిసిన 67 టెస్టుల్లో ఏకంగా 39 టెస్టుల్లో భారత్ జట్టును కోహ్లీ గెలిపించాడు. అలానే ధోనీ 27 టెస్టులు, గంగూలీ 21, అజహరుద్దీన్ 14 టెస్టుల్లో భారత్ జట్టుకు విజయాలను అందించారు.