రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరంగా కాగా ఇప్పుడు వన్డేలకు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ టెస్టులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ సిద్ధమవుతాడని అందరూ భావించారు.
Read Also: తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు భారత్ ఆలౌట్
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
అయితే తాజాగా రోహిత్ తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి 4 నుంచి 6 వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్‌కు అప్పగిస్తారని సమాచారం. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ విషయం భారత క్రికెట్‌లో పెద్ద దుమారం లేపింది. గంగూలీకి, కోహ్లీకి మధ్య విభేదాలు ఉన్నాయని మీడియా తెగ ప్రచారం చేసింది. ఇప్పుడు వన్డేలకు రోహిత్ దూరం కానుండటంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. జనవరి 19 నుంచి 23 వరకు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..