టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో భారత దిగ్గజ బౌలర్లకు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 3 వికెట్లు సాధించాడు. తద్వారా విదేశాల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఈ రికార్డును కేవలం 23 మ్యాచ్‌ల ద్వారానే 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
Read Also: ఈ ఏడాది టెస్టుల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
ఈ జాబితాలో బి.చంద్రశేఖర్ (25 మ్యాచ్‌లు), రవిచంద్రన్ అశ్విన్ (26 మ్యాచ్‌లు), బిషన్ సింగ్ బేడీ (28 మ్యాచ్‌లు), జవగళ్ శ్రీనాథ్ (28 మ్యాచ్‌లు), మహ్మద్ షమీ (28 మ్యాచ్‌లు) బుమ్రా తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా బుమ్రా ఇప్పటివరకు 25 టెస్టులు ఆడగా అందులో 23 టెస్టులు విదేశాల్లోనే ఆడటం విశేషం. 2018లో దక్షిణాఫ్రికాతోనే బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
Jasprit Bumrah, the fastest to 100 overseas Test wickets for India ⚡ pic.twitter.com/QUqGPZVabO
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2021