టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల వివాహమై నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భావోద్వేగంతో ట్విట్టర్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాలుగేళ్లుగా నేను వేసిన సిల్లీ జోకులను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావు. నాలుగేళ్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. గత నాలుగేళ్లలో నాలో…
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘోర పరాజయం చెందిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 5 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడు పెనాల్టీ పాయింట్లు కోల్పోయిన జట్టు కేవలం 9 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. అంతేకాదు.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్…
యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఉదయం సెషన్లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ 152 పరుగులతో భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ వార్నర్ 94, లబుషేన్ 74, స్టార్క్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, మార్క్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశాడు. లీచ్, రూట్…
మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్ ఎవ్వరూ అనే చర్చ మొదలైంది. మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అనంతరం మిథాలీ రాజ్ రిటైర్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో మిథాలీ వారసురాలిగా స్మృతీకి ఛాన్స్ ఇవ్వాలని మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి అభిప్రాయపడింది. టీ20జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ నాయకత్వం వహిస్తుంది. కానీ ఆమె బ్యాటింగ్‌లో రాణించలేకపోతుందన్నారు. దీంతో మిథాలీ వారసురాలిగా…
ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు…
అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. తాజాగా వన్డే మ్యాచ్‌ల కెప్టెన్సీ నుంచి కూడా దూరమయ్యాడు. బుధవారం నాడు బీసీసీఐ టీమిండియా వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్‌కు బదలాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక ఓ 48 గంటల స్టోరీ దాగి ఉన్నట్లు పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. నిజానికి 2023 వరకు విరాట్ కోహ్లీ వన్డేలకు కెప్టెన్‌గా ఉండాలని భావించాడు. Read Also: టెస్ట్…
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లంటే ఎంత ఆసక్తి ఉంటుందో… ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈనెల 8 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగనుంది. తొలి టెస్టు బ్రిస్బేన్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.5:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ దగ్గుతో…
టీమిండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 50 విజయాలు సాధించిన మొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా ప్రతి ఫార్మాట్లో కనీసం 50 విజయాలు సాధించిన తొలి క్రికెటర్‌గానూ రికార్డు అందుకున్నాడు. విరాట్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ అభినందనలు తెలిపింది. కాగా టెస్టుల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 66 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా జట్టుకు 39…
తమ దేశంలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. Read Also: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…