ఈ ఏడాది టెస్టుల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ఏ జట్టు అయినా టెస్టు ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే టెస్టుల్లో అన్ని జట్లు రాణించాలని తాపత్రయపడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ ఉన్నా ఆ జట్టు చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం అత్యంత గడ్డుకాలంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది.
Read Also: IND Vs SA: రెండో రోజు ఆట పూర్తిగా వర్షార్పణం
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఇంగ్లీష్ జట్టును తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లండ్ ఆడిన 28 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు 200లోపు స్కోరుకే ఆలౌటైంది. మరోవైపు ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో ఈ ఏడాది 50 మంది గోల్డెన్ డక్ లేదా డకౌట్ అయ్యారు. ఈ జాబితాలో 34 డకౌట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఒక ఏడాది టెస్టుల్లో అత్యధికంగా డకౌట్లు నమోదు చేసిన జట్టు కూడా ఇంగ్లండ్ జట్టే. 1998లో ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్‌మెన్ ఏకంగా 54 సార్లు డకౌట్ అయ్యారు. ఇప్పుడు 50 డకౌట్లతో రెండో స్థానంలో కూడా ఆ జట్టే ఉండటం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్ ఘోర పరాభవం దిశగా వెళ్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిన రూట్ సేన.. మూడో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది.
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!