సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడో రోజు ఆటలో భారత్ తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే… సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 123 పరుగుల వద్ద కీపర్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే రహానె కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ వికెట్లు కోల్పోయింది.
Read Also: ఈ ఏడాది టెస్టుల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
కీపర్ రిషబ్ పంత్ (8), రవిచంద్రన్ అశ్విన్ (4), శార్దూల్ ఠాకూర్ (4), మహ్మద్ షమీ (8) దారుణంగా విఫలమయ్యారు. బుమ్రా (14) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. కాగా దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి నింగిడి ఆరు వికెట్లు పడగొట్టగా… రబాడ 3 వికెట్లు తీశాడు. జాన్సన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో రోజు తొలి సెషన్‌లో భారత్ ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది.