ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో ఉన్నాయి. Read Also: రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం మరోవైపు…
టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్బోర్న్లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు…
ముంబై టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు సాధించగా.. 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మళ్లీ ఆ ఘనత సాధించి మూడో…
సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు. Read Also: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ…
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 221/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరో నాలుగు పరుగులు జోడించిన వెంటనే టీమిండియా సాహా (27) వికెట్‌ను కోల్పోయింది. ఈ వికెట్ కూడా అజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లింది. అయితే వెంటనే అదే ఓవర్లో భారత్‌కు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్…
ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల…
ఐపీఎల్-2022 కోసం రిటైనింగ్ ప్రక్రియ ముగిసింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌ను వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. అయితే వారిని రిటైన్ చేసుకోకపోవడానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్లో అహ్మదాబాద్, లక్నో జట్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించడం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. Read Also: IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే ! సన్‌రైజర్స్ స్టార్…
ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో భారత్‌ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్‌పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి…
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆకట్టుకున్న దేశవాళీ క్రికెటర్లలో రాహుల్ తెవాటియా ఒకడు. 1993లో మే 20న హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా క్రికెట్లో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్‌పై రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్‌ను క్రీడాభిమానులు ఎవరూ మరిచిపోలేరు. రాజస్థాన్ ఓడిపోతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఆటగాడు రాహుల్ తెవాటియా. Read Also: ఫుట్‌బాల్ స్టార్…