భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా ఆజింక్యా రహానె 40 పరుగులతో క్రీజులో నిలబడ్డాడు. అయితే రెండో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి వల్ల రద్దయింది.
Read Also: సెంచూరియన్ టెస్ట్: తొలిరోజు ముగిసిన ఆట
సెంచూరియన్‌లో ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానం చిత్తడిగా మారింది. ఓసారి వర్షం ఆగడంతో మైదానంలోని నీటిని తొలగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. అంతలోనే మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో నీటి తొలగింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అంపైర్లు లంచ్ ప్రకటించారు. లంచ్ తర్వాత అయినా వరుణుడు కరుణిస్తే ఆట ప్రారంభం అవుతుంది. లేదంటే రెండో రోజు మొత్తం వర్షార్పణం కానుంది.