న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో తొలి రోజు టీమిండియా మంచి స్కోరే చేసింది. అయితే టీమిండియా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. ఎందుకంటే వాళ్లు చేసిన పరుగులు 13వ ఎక్కాన్ని తలపిస్తుండటమే కారణం. మయాంక్ అగర్వాల్ 13 పరుగులు, శుభ్‌మన్ గిల్ 52 పరుగులు, పుజారా 26 పరుగులు చేశారు. దీంతో వీరి స్కోర్లు 13వ ఎక్కాన్ని గుర్తుచేస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Read Also: తొలి రోజు…
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కెరీర్లో ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహకారం అందించాడు. జడేజా 100 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేసి క్రీజులో…
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌తో తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11…
టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం నాడు ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. దీంతో అతడు 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో…
టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. బుధవారం నాడు క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఎందుకంటే అతడు తొలిసారిగా తండ్రయ్యాడు. భువనేశ్వర్ భార్య నుపుర్ నగర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2017 నవంబర్ 23న వీరికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివాహం జరిగింది. నాలుగో వార్షికోత్సవం ముగిసిన మరుసటి రోజే భువీ భార్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం 9 గంటలకు…
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే…
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20ని కూడా మనోళ్లు వదిలిపెట్టలేదు. దీంతో కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను రోహిత్ శర్మ ప్రత్యేకంగా మలుచుకున్నాడు. కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ20లో 74 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను 111 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ గప్తిల్ (52) మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 185 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. ఓపెనర్ రోహిత్ (56) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుతిరిగాడు. చివర్లో దీపక్…
కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవడం ఇది వరుసగా మూడో సారి. ఇప్పటివరకు రోహిత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, అశ్విన్‌లకు రెస్ట్ ఇచ్చిన జట్టు మేనేజ్మెంట్… ఇషాన్ కిషన్, చాహల్‌ను తీసుకుంది. అటు న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌథీ…
గాలె వేదికగా శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలజానో అరంగేట్రం చేశాడు. అయితే కెరీర్లో ఆడుతున్న తొలి టెస్టులోనే సొలిజానోకు దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్ ఆటగాడు సొలిజానో వికెట్లకు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొట్టిన బలమైన షాట్ సొలిజానో నుదుటిపై బలంగా తాకింది. Read Also: నా…