కరోనా బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో… బూస్టర్ డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. మిక్స్ అండ్ మ్యాచ్ వద్దని తేల్చి చెప్పింది మోడీ సర్కార్. మూడో డోసుల విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు 2లక్షలకు చేరువలో వున్నాయి.…
దేశంలో కరోనా తీవ్రత తగ్గలేదు. కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. 15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషనుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.2022 జనవరి 3 తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయనుంది ప్రభుత్వం.కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ వయస్సున్న వారందరికీ ప్రస్తుతం కోవాక్సిన్ టీకాను మాత్రమే వేస్తున్నట్టు ప్రకటించింది వైద్యారోగ్యశాఖ. 2007 కంటే ముందు పుట్టిన వారంతా ఈ వ్యాక్సిన్ డోసుకు అర్హులని…
ఇంటికొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తాను అంది.. సరేనని ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంట్లోకి ఆహ్వానించింది.. వ్యాక్సిన్ కన్నా ముందు కళ్లలో చుక్కలు వేయాలని.. ఒక మందు సీసాతో నిలబడింది. వ్యాక్సిన్ ఎలా వేస్తారో తెలియని ఆమె సరే అంది. అంతే ఇదే అదును అనుకోని కంట్లో చుక్కలు వేసి ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసును తెప్పుకుబోయింది కిలాడీ లేడి.. ఈ ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్టాంటన్‌పురంలో…
ఒకవైపు కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. అయినా జనంలో మార్పు రావడం లేదు. మాస్క్ మరిచిపోయారు. శానిటైజర్ దూరం పెట్టేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే కొందరు తమ వైఖరి మార్చుకోవడం లేదు. వ్యాక్సిన్ వేస్తాం రమ్మంటే దూరంగా వెళ్ళిపోతున్నారు. READ ALSO ఈ బామ్మలు సమ్‌థింగ్ స్పెషల్.. ఎందుకో తెలుసా? తాజాగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో ఆరోగ్య సిబ్బందికి వింత అనుభవం…
కంటికి కనిపించకుండా ఎటాక్ చేసి ఎంతో మంది ప్రాణాలు తీసింది కరోనా మహమ్మారి.. మరెంతో మంది దాని బారినపడి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారు.. ఆ మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. దీని కోసం దేశీయంగా తయారైన వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది.. అయితే, మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.. Read Also: సైబర్ నేరగాళ్ల…
భారత్ సహా యావత్తు ప్రపంచాన్ని కరోనా రక్కసి తన చేతుల్లో బంధించింది. కరోనా ప్రభావంతో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కరోనా బారినపడి ఎన్నో కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆయా దేశాలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్స్‌లను కనుగొని పంపిణి చేసింది. భారత్‌లో కూడా కోవాగ్జిన్, కోవిషీల్డ్ లాంటి టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌తో మరింత…
జర్మనీలో కరోనా కొత్త కేసుల్లో ఆల్‌టైం రికార్డు సృష్టించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎన్నడు రానన్ని కొత్త కేసులు నమోదు కావడం ఆ దేశాన్ని కలవర పెడుతుంది. గడిచిన 24గంటల వ్యవధి లోనే జర్మనీలో 33,949 కొత్త కేసులు నమోదైనట్టు అధికారలు వెల్ల డించారు. గతేడాది డిసెంబర్ 18నఅత్యధికంగా 33,777 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు ఆ సంఖ్యను మించిపోయాయి. దీంతో జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్‌స్పాన్ 16 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో…
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్‌లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ…
కరోనాపై పోరాటంలో భాగంగా ఇప్పటికే ఎన్నోరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ నడుస్తోంది. ఈ మధ్యే భారత్ 100 కోట్ల డోసుల మార్క్‌ను కూడా క్రాస్ చేసి రికార్డు సృష్టించింది.. మరోవైపు.. చిన్నారులకు వ్యాక్సిన్లపై కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ కూడా పిల్లలకు వ్యాక్సిన్‌లో ముందు వరుసలో నిలిచింది.. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అమ్‌వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్‌కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా…