జర్మనీలో కరోనా కొత్త కేసుల్లో ఆల్‌టైం రికార్డు సృష్టించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎన్నడు రానన్ని కొత్త కేసులు నమోదు కావడం ఆ దేశాన్ని కలవర పెడుతుంది. గడిచిన 24గంటల వ్యవధి లోనే జర్మనీలో 33,949 కొత్త కేసులు నమోదైనట్టు అధికారలు వెల్ల డించారు. గతేడాది డిసెంబర్ 18నఅత్యధికంగా 33,777 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు ఆ సంఖ్యను మించిపోయాయి. దీంతో జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్‌స్పాన్ 16 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. చలికాలంలో కోవిడ్ వ్యాప్తి నియం త్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో మళ్లీ ఐసీయూలు నిండిపోవడం, పిల్లలో ఇన్ఫెక్షన్లు పెరిగి పోతుండటం వంటి కీలక అంశాలపై ఆయన చర్చించారు.
జర్మనీలో ఇప్పటివరకు 46.62 లక్షలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. వీరిలో 96 వేల మందికి పైగా మృతి చెందారు. 43.28 లక్షల మంది కోలుకున్నారు. కాగా, గురువారం ఒక్కరోజే జర్మనీలో165 మరణాలు నమోదు అయ్యాయి. జర్మనీలో ఇంకా టీకాలు వేసుకోని వారంతా టీకాలు వేసుకోవాలని వైద్యాధికారులు అక్కడి పౌరులకు సూచిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. జర్మనీలో 83 మిలి యన్ల జనాభాలో మూడింట రెండొంతుల మందికి మాత్రమే వ్యాక్సి నేషన్ తొలి రౌండ్ పూర్తి అయింది. దాదాపు 16.2 మిలియన్ల జనాభా కు ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కావాల్సి ఉంది. 60 ఏళ్లు పైబడిన వారం దరికి, నర్సింగ్ హోమ్ రెసిడెంట్స్, సిబ్బందికి బూస్టర్ డోస్ ఇవ్వాల ని నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 2 మిలియన్ల మందికి మాత్రమే పూర్తి చేశారు.
డజన్ల మంది చనిపోవడంతో కోవిడ్ పరీక్షలు చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. టీకా తీసుకోని వ్యక్తులెవరూ కోవిడ్ బారినపడే అవకాశం ఉండే వ్యక్తులను కలవొద్దని అక్కడి వైద్యాధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ నిబంధనను సీనియర్ సీటీజన్ హోమ్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు కూడా వర్తింపజేయాలన్నారు.