కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అమ్‌వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్‌కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా అందిస్తున్నారు.. అంతే కాదు.. లక్కీ డ్రా కూపన్ కూడా అందిస్తున్నారు.. దీంతో.. ఆమ్‌వాద్ కార్పొరేషన్ పరిధిలో.. వ్యాక్సిన్ కోసం క్యూకడుతున్నారు ప్రజలు. అయితే, ఈ ఆఫర్ వెనుక ఓ టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు… ఆమ్‌వాద్‌లో వంద శాతం టీకా లక్ష్యాన్ని చేరుకోవడమే వారి టార్గెట్‌గా ఉంది.