కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో రెండు వ్యాక్సిన్లను తయారు చేసిన భారత్.. అగ్రదేశాలు ఎవరూ చేయని విధంగా.. ఉదారంగా ఇతర దేశాలకు సాయం చేసింది. కోట్లాది డోసులు ఉచితంగా చిన్న దేశాలకు పంపిణీ చేసి మానవత్వం చాటుకుంది. అయితే, కోవిడ్ థర్డ్‌వేవ్ ఎఫెక్ట్, టీకా కొరత, విపక్షాల విమర్శలతో గత కొన్ని నెలలుగా విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిపి వేసిన ఇండియా… మరోసారి కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. కొవిడ్ వ్యాక్సిన్లను…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలతో… పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను… బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఆయన ఇచ్చే ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది.. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని దేశాలను కలవరానికి గురిచేస్తుండగా… కోవిడ్ కట్టడానికి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ తరుణంలో కిమ్ షాకింగ్ ప్రకటన చేశారు.. కోవిడ్ వ్యాక్సిన్ తమకు అవసరం లేదని ప్రకటించారు.. దీనికి బదులుగా తమదైన శైలిలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలంటూ అధికారులకు…
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 60 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా కార్యక్రమంలో వేగం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 5లోగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇప్పటి వరకు 18 ఏళ్ల పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. 18 ఏళ్లకు దిగువ వయస్సున్నవారిపై మాత్రం కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి.. ఈ దశలో భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ముందుంజలో ఉంది.. మరోవైపు.. పెద్దలకు సింగిల్ డోస్‌తో వ్యాక్సిన్ రూపొందించి పంపిణీ చేస్తోంది అమెరికా…
చిత్తూరులో వ్యాక్సిన్ వేసుకుంటేనే వృద్ధాప్య పింఛన్ అని ఓ వాలంటీర్ కొత్త రూల్ తెచ్చాడు. కుప్పం మం.పైపాల్యం గ్రామ సచివాలయంలో పని చేస్తున్నా సతీష్ వాలంటీర్ నిర్వాకం ఇది. బాధితుడు కుప్పచిన్న స్వామికి మూడోసారి వ్యాక్సిన్ వేయించాడు వాలంటీర్. వ్యాక్సిన్ వేసుకుంటేనే వృద్ధాప్య పింఛన్ అన్నందుకు విధిలేక వేసుకున్నాడు బాధితుడు. ఇప్పటికే నాకు రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పినా వాలంటీర్ పట్టించుకోలేదు అని తెలిపాడు. వైద్య సిబ్బంది చేత వ్యాక్సినేషన్ వేయించి పింఛన్ ఇచ్చారు…
తెలంగాణలో వాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. జూన్‌లో పెద్దెత్తున వాక్సినేషన్ జరిగినా, ఒక్కసారిగా ఢీలా పడింది. మొదటి డోస్ వేసుకున్నోళ్లకు రెండో డోస్ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్ డోస్ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో జనం వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైరిస్క్‌లో ఉన్న వాళ్ళకు మాత్రమే వాక్సిన్ వేయగా అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు…
ఈ మధ్య ఆన్ లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు… బడా నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేసి మరీ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లను అడ్డుపెట్టుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్…
బిగ్ వ్యాక్సినేషన్ డేను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల వరకు వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. గీతా ప్రసాదిని.. రేపు ఒక్క రోజే ఒక్కో జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.. కనీసం 8 నుంచి 10 లక్షల డోసుల వరకు వేయగలుగుతామనే…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని దేశాలు క్రమంగా వ్యాక్సిన్‌పై దృష్టిసారిస్తున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం బిగ్ వ్యాక్సిన్ డే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.. రేపు ఏపిలో బిగ్ వ్యాక్సిన్ డే నిర్వహించనున్నారు.. ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.. దీనిలో భాగంగా జిల్లాలకు టార్గెట్ ఫిక్స్ చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు.. ఇప్పటి వరకు ఒక్క రోజే 6 లక్షల వ్యాక్సిన్లు…