కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భయాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్కడక్కడ నర్సులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో విధుల్లో ఉన్న నర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేపటికి కళ్లు తిరిగిపడిపోయిన ఆ యువతిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్…
కరోనాను పారద్రోలే ప్రయత్నంలో సెలెబ్రిటీలంతా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ను వేయించుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లో మొదటి మోతాదును తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పిక్ పోస్ట్ చేశారు కార్తీ. ఈ పిక్ లో కార్తీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం మనం చూడవచ్చు. ఇక కరోనా పోరులో భాగంగా కార్తీ తన అన్న, తండ్రితో కలిసి తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాకుండా…
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను…
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కరోనా వ్యాక్సిన్ కోసం భారీ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మూడో క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకా కోసం 1500 కోట్ల రూపాయల మేర ముందస్తు డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ఆగస్ట్ – డిసెంబర్ మధ్య 30…
కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ విషయంలో బాధ్యత రాష్ట్రాలకే వదిలేసింది.. అయితే, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించగా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్రమే వ్యాక్సిన్లు పంపిణీ…
వాక్సిన్ అవకతవకల పై నిమ్స్ లో విచారణ ముగిసింది. డైరెక్టర్ ఆదేశాలతో విచరణ చేపట్టారు మెడికల్ సూపరేండ్డెంట్ ఎన్వీ సత్య నారాయణ. ఈ విహారంలో తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు కృష్ణరెడ్డి. వాక్సిన్ వేసేముందు ఐడీ కార్డు, ఆధార్ పరిశీలించకుండా ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. మార్చి,ఏప్రిల్ లో వాక్సిన్ వేసుకున్న అందరి వివరాలను ఆన్లైన్ లో ఎందుకు రిజిష్టర్ చేయలేదని ప్రశ్నించారు.మరో మూడు రోజుల్లో విజిలెన్స్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. అయితే…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో వ్యాక్సినేషన్‌పై గందరగోళం కొనసాగుతూనే ఉంది.. దీనికి కారణం.. రాష్ట్రాల దగ్గర సరైన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడమే కారణం.. దీంతో.. క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం పాలసీని తప్పుబడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 22,77,62,450 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు తమ దగ్గర…
ఆంద్రప్రదేశ్ కు మరో 4.44 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు… అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్నాయి వ్యాక్సిన్. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది. అయితే ఏపీలో కరోనా కేసులు భారీగా…
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ…
కరోనాను కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు ప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మొదట్లో.. ఆది తీసుకోవడానికి వెనుకడుగు వేసినవారు ఎందరో.. ఇప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ భయం లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారు.. వ్యాక్సినేషన్ తర్వాత కొందరు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్తలు హల్ చల్ చేశాయి.. అయితే, భారత్‌లో వ్యాక్సిన్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్…