ఇంటికొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తాను అంది.. సరేనని ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంట్లోకి ఆహ్వానించింది.. వ్యాక్సిన్ కన్నా ముందు కళ్లలో చుక్కలు వేయాలని.. ఒక మందు సీసాతో నిలబడింది. వ్యాక్సిన్ ఎలా వేస్తారో తెలియని ఆమె సరే అంది. అంతే ఇదే అదును అనుకోని కంట్లో చుక్కలు వేసి ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసును తెప్పుకుబోయింది కిలాడీ లేడి.. ఈ ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. స్టాంటన్‌పురంలో కళావతమ్మ అనే మహిళ కుటుంబంతో నివసిస్తోంది. శుక్రవారం ఇంట్లోవారు బయటికి వెళ్లడంతో ఆమె ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ విషయం గమనించిన ఒక మాయ లేడి.. వారింటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి వచ్చినట్లు పరిచయం చేసుకోంది. నిజమే కదా అనుకోని కళావతమ్మ ఆమెను లోపలి పిలిచి మాట్లాడింది. అనంతరం వ్యాక్సిన్ వేయాలంటే ముందు కళ్లలో చుక్కలు వేయాలని.. ఐ డ్రాప్స్ ని ఆమె కళ్ళలో వేసి కళ్ళు మూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యింది. ఈ షాకింగ్ ఘటన నుంచి తేరుకొని కళావతమ్మ బిగ్గరగా కేకలు వేసి బయటికి వచ్చి చూసిన మహిళ కనిపించలేదు. అనంతరం అర్బన్ తాలూకా పోలీసు స్టేషన్ లో మహిళపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.