15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సిన్.. మార్గదర్శకాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా తీవ్రత తగ్గలేదు. కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. 15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషనుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.2022 జనవరి 3 తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయనుంది ప్రభుత్వం.కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ వయస్సున్న వారందరికీ ప్రస్తుతం కోవాక్సిన్ టీకాను మాత్రమే వేస్తున్నట్టు ప్రకటించింది వైద్యారోగ్యశాఖ.
2007 కంటే ముందు పుట్టిన వారంతా ఈ వ్యాక్సిన్ డోసుకు అర్హులని కోవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం.వ్యాక్సిన్ వేసే వైద్యారోగ్య కేంద్రాల్లోనూ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపిన ప్రభుత్వం. రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు 2022 జనవరి 10 తేదీ నుంచి మరో డోసు ఇవ్వనుంది ప్రభుత్వం.
Also Read
రెండో డోసు తీసుకుని 9 నెలలు దాటితేనే బూస్టర్ డోసు వేసుకునేందుకు అర్హులని ప్రకటించింది వైద్యారోగ్యశాఖ. 2 టీకా డోసులు తీసుకున్న 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులకూ ఇదే తరహాలో మరో డోసు వ్యాక్సీన్ టీకాను జనవరి 10 తేదీ నుంచి అందించనున్నట్టు ప్రకటించింది వైద్యారోగ్యశాఖ.టీకా రెండో డోసు తీసుకుని 39 వారాలూ లేదా 9 నెలలు దాటితేనే ఈ వ్యాక్సిన్ బూస్టర్ టీకా వేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలన్నీ 2022 జనవరి 3 తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ సర్క్యులర్ జారీచేసింది.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!