ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు. Read…
భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్ ఎఫెక్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల…
కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తోన్న తరుణంలో.. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కేంద్రం.. ఇప్పటికే కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వెళ్లాయి.. అయితే, రాష్ట్రంలోని అన్ని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆసుపత్రిలో…
నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రంగా షార్ కేంద్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది… కేవలం ఒకేరోజు 142 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కలవరం మొదలైంది.. ఇక, నిన్న 91 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది… సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది.. దీంతో.. పెద్ద ఎత్తున కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పటికే 50…
తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కోవిడ్ బారినపడ్డారు.. మరోవైపు.. సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. ఇలా చాలా మందికి కోవిడ్ సోకింది.. తాజాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో… మంత్రులు, ఇతర నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. జిల్లాలో పంట నష్టంపై తాజాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి… ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది.. జిల్లాలో నిన్న ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. అందులో 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కోవిడ్ సోకింది.. ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి చొప్పున కరోనా వచ్చింది.. ఒంగోలు కేంద్రీయ…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే…
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. అయితే, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించింది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. Read Also: ఇక వన్డే సమరం.. సిరీస్‌పై…
తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత,…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. Read Also:…