ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు.
Read Also: అంతర్జాతీయ విమానాలపై నిషేధం మరోసారి పొడిగింపు
దేశంలోని ప్రజలందరూ మాస్కులు వాడుతూ వ్యక్తిగత దూరం పాటిస్తున్నారని… ప్రజలు ఇదే మాదిరిగా పోరాటం కొనసాగిస్తే.. ఎటువంటి కొత్త వేరియంట్లు పుట్టకపోతే మార్చి 11 నాటికి కరోనా ఎండెమిక్‌గా అంటే సాధారణ ఫ్లూగా మారిపోతుందని డా.సమీరన్ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ స్థానాన్ని భర్తీ చేసే కొత్త వేరియంట్లు రావని తాము విశ్వసిస్తున్నామని ఆయన తెలిపారు. తమ లెక్కల ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ మూడు నెలల పాటే ఉంటుందన్నారు. డిసెంబర్ 11న మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ మార్చి 11తో ముగుస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో కరోనా వేవ్ ఒకే విధంగా లేదన్నారు. ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు పతాక స్థాయికి చేరతాయో లేదో అన్న విషయంపై మరో రెండు వారాల పాటు వేచి చూడాలన్నారు.