ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి… ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది.. జిల్లాలో నిన్న ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. అందులో 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కోవిడ్ సోకింది.. ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి చొప్పున కరోనా వచ్చింది.. ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో ఒక్కక్కరు చొప్పున ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో బోధనేతర సిబ్బందికి కోవిడ్ సోకింది.
Read Also: 3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్ వార్నింగ్
దీంతో.. బాధితులను హోంఐసోలేషన్‌కు తరలించారు అధికారులు.. సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి స్కూళ్లను ప్రారంభించింది ప్రభుత్వం.. ఈ సోమవారం నుంచి మళ్లీ స్కూళ్లు, విద్యా సంస్థలు తెరుచుకున్నాయి.. ఈ సమయంలో.. భారీగా కోవిడ్ కేసులు నమోదుతో.. ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విన్నవించుకుంటున్నారు. కాగా, కరోనా కేసుల దృష్ట్యా.. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించగా.. ఏపీలో మాత్రం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా.. స్కూళ్లను తిరిగి ప్రారంభించింది.. ఈ సమయంలో.. కోవిడ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది.