కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తోన్న తరుణంలో.. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కేంద్రం.. ఇప్పటికే కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వెళ్లాయి.. అయితే, రాష్ట్రంలోని అన్ని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.. కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి పట్ల భయం వద్దని సూచించారు.. అన్ని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. తెలంగాణలో 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
Read Also: ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్
ఇక, చాలా వరకు హోమ్ ఐసోలేషన్ కిట్లతోనే కరోనా మహమ్మారి వ్యాధి నయం అవుతుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. వ్యాధి వల్ల ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించిన ఆయన.. కరోనా బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యంతో పేస్ట్ ఐసీయూలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.. కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి తన్నీరు హరీష్‌రావు.. కాగా, తెలంగాణతో పాటు.. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే, ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉండడం రిలీఫ్ ఇచ్చే అంశం.