కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.. అన్ని రాష్ట్రాల్లోనూ థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. అయితే, వైరస్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం.. ఎందుకంటే.. వీరి నుంచి మరికొందరికి ఈ మహమ్మారి సోకుతూ పోతోంది.. 60 శాతం మంది అసింప్టమాటిక్‌గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ…
కరోనా థర్డ్‌వేవ్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక, స్కూళ్లపై పంజా విసురుతోంది మహమ్మారి.. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా పొజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల తర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో 147 మందికి…
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మహమ్మారి బుసలు కొడుతోంది.. వరుసగా భారీ స్థాయిలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత క్రమంగా కోవిడ్ మీటర్ పైకే కదులుతోంది.. ఓవైపు టెస్ట్‌ల సంఖ్య తగ్గినా.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్ పరీక్షించగా 13,212 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఐదుగురు కోవిడ్ బాధితులు…
చిత్ర పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రోలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. `హలో ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చింది. ఇంట్లోవిశ్రాంతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్” అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు.…
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయములో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. జిల్లాలో కరోన థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు చేశాం అన్నారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించాము. వాక్సినేషన్లో రాష్ట్రములోనే జిల్లా ఐదవ స్థానములో ఉంది. జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాభై వేల ఇండ్లు ఫీవర్ సర్వే చేస్తున్నాయన్నారు.…
కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారంతో పోలిస్తే దాదాపు 30వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 703 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66, 027కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,88,396కి…
ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్.. తనను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిన ఆ దేశంపై న్యాయ పోరాటం చేసినా జకోవిచ్‌కు ఊరట దక్కగ పోగా.. వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో.. రెండోసారి కూడా ఆయన వీసాను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన జకోవిచ్.. తన 21వ గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ, ఇప్పుడు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఆసీస్‌లోని స్కాట్ మోరిసన్ సర్కార్‌పై పరువు నష్టం దావా…
చిత్ర పరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకు స్టార్లు కరోనా బారిన పడడం ఎక్కువైపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం విదితమే.. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్‌డౌన్‌కు వెళ్లేది లేదంటున్నారు…