యూరప్ లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కరోనా కారణంగా బ్రిటన్ అతలాకుతలం అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ దేశంలో ఒమిక్రాన్ విరుచుకుపడింది. వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కరోనా బారిన పడినప్పటికీ పెద్దగా మరణాలు సంభవించలేదు. దీంతో కరోనా మొదటి వేవ్ సమయంలో 14 రోజుల క్వారంటైన్ ఉండగా, ఆ తరువాత వారం రోజులకు తగ్గించారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడు…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం…
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ క్లాసులు కంటిన్యూ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూను అమలు చేయాలనే అలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై నేడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,570 కేసులు వెలుగు చూశాయి. ఓ పక్క సామాన్యులు.. మరోవైపు రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారిన పడ్డారు. దీంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను షిఫ్ట్‌లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా…
చిత్ర పరిశ్రమను కరోనా వదలడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. స్టార్లందరూ కరోనా బారినపది ఐసోలేషన్స్ లో ఉండడంతో అభిమానులు భయాందోళనలకు గురవుతన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని లేకుండా అన్ని చోట్ల కరోనా విళయతాండవం సృష్టిస్తోంది. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ బారిన…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి..…
1) తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఈనెల 17 నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16న దీనిపై విద్యాశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే విద్యాధికారుల ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంది. 2) టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది.…
పశ్చిమ బెంగాల్ కోవిడ్ నిబంధనలను సడలించింది. వివాహాలకు 200 మంది ఒకేసారి గరిష్టంగా 200 మంది అతిథులతో వివాహ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. శనివారం ఈ మేరకు కోవిడ్ -19 సడలింపులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లో జాతరలు మరియు మేళాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని “ఓమిక్రాన్ వేరియంట్‌పై ఉన్న రిపోర్టులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర…