నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రంగా షార్ కేంద్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది… కేవలం ఒకేరోజు 142 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కలవరం మొదలైంది.. ఇక, నిన్న 91 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది… సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది.. దీంతో.. పెద్ద ఎత్తున కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పటికే 50 శాతం హాజరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. పలు ప్రయోగాలపై కరోనా ప్రభావం పడుతుంది… ప్రయోగాలు మరింత వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు.