కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. ఒమిక్రాన్ ఎంట్రీతో థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. దీంతో.. అన్ని ప్రభుత్వాలు కట్టడి చర్యలకు దిగుతున్నాయి.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా.. రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. మరోవైపు.. ప్రభుత్వం గతంలో విధించిన కరోనా ఆంక్షలు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడిగించింది తెలంగాణ సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. Read Also: కోవిడ్ పంజా.. తెలంగాణ సర్కార్…
మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు,…
సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. కానీ టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… ఒక్కరోజులో.. ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ, తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత అధికంగా ఉండటంతో మరణాల సంఖ్య అధికంగా ఉన్నది. గతంలో మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకుతున్నట్టుగా నిర్ధారణ జరిగిన సంగతి తెలిసిందే. డెల్టా వేవ్ సమయంలో…
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం రోజున తెలంగాణలో 3557 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఐసీఎంఆర్ కరోనా చికిత్సా విధానంపై కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. రోజుకు ఐదు సార్లుకు మించి దగ్గు, జ్వరం వంటివి వస్తే వైద్యుల సలహా మేరకు మందులు వినియోగించాలి. ఇంట్లోనే ఉన్నప్పటికీ భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో ఉన్నా మాస్క్…
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) చేత హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌లు పొందిన 1,636 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఒక సంచలనాత్మక దీర్ఘకాలిక అధ్యయనం, వయస్సుతో పాటు, కోవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి స్థాయిలు కూడా క్షీణిస్తాయని సూచించింది. “మా అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సమానంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 30 శాతం మంది వ్యక్తులు 6 నెలల తర్వాత రక్షిత రోగనిరోధక శక్తి స్థాయిల కంటే యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నారని…
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా సోకుతూనే ఉన్నది. ముస్సోరీలోని లాల్ బహదూర్‌శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మనిష్ట్రేషన్‌లో కరోనా కలకలం రేగింది. ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు 84 మందికి కరోనా సోకింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తెలియజేసింది. కరోనా సోకిన 84 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులను సపరేట్‌గా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐఏఎస్…
కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి…