దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సర్కారును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని వివిధ దేశాలు హెచ్చరిస్తున్న తరుణంలో మోడీ సర్కార్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థర్డ్ వేవ్ అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి… గత బులెటిన్ ప్రకారం 18 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఏపీ సర్కార్ తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. మరోసారి కొత్త కేసులు 20 వేలు దాటింది.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 99 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 21,274 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి… రికవరీ రేటు పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేసింది కేంద్రం… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్… పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం ఉందన్న ఆయన.. ఇప్పుడు అది 85.6 శాతానికి చేరిందన్నారు. ఇక, గత 24 గంటల్లో కోవిడ్నుం చి 4,22,436 మంది కోలుకున్నట్టు వెల్లడించారు లవ్ అగర్వాల్.. దేశంలో ఇంత భారీ…
గత యేడాది కంటే ఈ సంవత్సరం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో వేలాది మంది థియేటర్ల యాజమాన్యం సొంత నిర్ణయంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. విడుదల అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత పడే ఛాయలు కనిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్రసీమ వసూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండగా, గత యేడాదిలో…
కరోనా విషయంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ… రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించిన ఆమె.. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని దుయ్యబట్టారు… పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని మండిపడ్డారు. ఇక, కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించిన ఆమె..…
ఇప్పుడు భారత్‌లో బయటపడిన కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచదేశాలను వణికిస్తోన్నాయి.. భారత్‌లో గుర్తించిన బి.1.617, బి.1.618 వేరియంట్లు.. చాలా దేశాలకు పాకింది.. సమస్యగా కూడా మారిపోయింది. అయితే భారత్ వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని యూఎస్‌కు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్, లాంగోన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షలో గుర్తించారు.. ఆ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల నమూనాలను సేకరించిన పరిశోధకులు.. భారత్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్లతో కలిపి…
కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో మే 24 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ పొడిగింపుపై కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకోనున్నది. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటీకి కరోనా కేసులు కంట్రోల్ కావడంలేదు. రోజువారి కేసులు 38 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ను అమలు చేస్తే…
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్నది. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. రికార్డ్ స్తాయిలో నమోదవుతున్నాయి. కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి భయపెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో ఈ ఫంగస్ కనిపిస్తోంది. కరోనాతో పాటుగా ఇతర సీరియస్ జబ్బులు ఉన్నవారికి ట్రీట్మెంట్ చేసే సమయంలో అధిక…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,63,533కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 33,53,765 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4329…
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనిపై పరిశోధకులు లోతైన పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే అని పరిశోధకులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్…