ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి… గత బులెటిన్ ప్రకారం 18 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ఏపీ సర్కార్ తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. మరోసారి కొత్త కేసులు 20 వేలు దాటింది.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 99 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 21,274 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 14,72,477కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 12,51,396 కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 9,580 మంది మరణించగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి..