కరోనా వైరస్ నిత్యం మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్‌లుగా మార్పులు చెందుతున్న సంగతి తెలిసిందే. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కొల్పోవడం వంటి లక్షణాలను కరోనా లక్షణాలుగా ఇప్పటి వరకూ పేర్కొంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరికొన్ని లక్షణాలు కూడా చేరాయి. కొంత మందిలో నాలుక ఎర్రబారడం, ఎండిపోవడం, దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటివి కూడా కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉంటే…
కరోనా ఫస్ట్ వేవ్‌లోనే కాదు.. సెకండ్ వేవ్‌లోనూ మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశంలోనే అత్యధిక కేసులు వెలుగు చూస్తూ వస్తోన్న మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో రికవరీ కేసులు పెరిగాయి.. కొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. మరో 974 మంది ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. మరోసారి భారీగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఏపీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 24,171 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచరీ దాటేసి 24 గంటల్లో 101 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 21,101 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు మరణిస్తే సర్కార్‌ది బాధ్యత కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108…
“ఆశయాల పందిరిలో…అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి… ఏటికెదురు నిలిచాయి” (యువతరం కదిలింది), “నేడే… మేడే’ (ఎర్రమల్లెలు), “మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం”, (నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాల అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ (70) కొవిడ్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. వీరికి భార్య, కుమారుడు ఉన్నారు. మాదాల రవి రూపొందించిన ‘నేను సైతం’ గీత రచయితగా అదృష్ట దీపక్ ఆఖరి చిత్రం. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపం… రాయవరం మండలం…
కరోనా కాలంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలో కేసులు మరింత భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక మహారాష్ట్రలో కేసుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడింది. పూణే జిల్లాలోని బారామతిలోని ముదాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ అనే బామ్మకు జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో బామ్మను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అయితే,…
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు సంస్థ భారీ సాయాన్ని ప్రకటించాయి. అటు క్రికెటర్లు, సినిమా స్టార్లు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేమస్ డైరెక్టర్ శంకర్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా కట్టడి కోసం.. తమిళనాడు ప్రభుత్వానికి రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు శంకర్. ఇక ఇప్పటికే సూర్య,…
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా…
కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా…
కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. ఊపిరి తీసుకోడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందించి రోగిని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటె, కరోనా సోకిన వ్యక్తికి కరోనా కంటే ముందు ఇతర జబ్బులు ఉన్నా, కరోనా…