కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్నది. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. రికార్డ్ స్తాయిలో నమోదవుతున్నాయి. కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి భయపెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో ఈ ఫంగస్ కనిపిస్తోంది.
కరోనాతో పాటుగా ఇతర సీరియస్ జబ్బులు ఉన్నవారికి ట్రీట్మెంట్ చేసే సమయంలో అధిక మోతాదులో మెడిసిన్‌ను ఇవ్వడం వలన ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధిని వెంటనే గుర్తించి సరైన చికిత్స అందించకుంటే ప్రాణాలు పోయో అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముక్కు లోపల భాగం నల్లగా మారడం, కను రెప్పలు ఎర్రగా మారడం, కంటి నుంచి పదేపదే నీరు కారడంతో పాటుగా చూపు మసకబారడం, అంగిలి లోపల నల్లగా మారిపోవడం, బుగ్గలు నోప్పిగా ఉండటం, పళ్లు కదలడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యం చేయించుకోవాలి. లేదంటే ఈ ఫంగస్ ఊపితిత్తులకు, మెదడుకు సోకి ప్రాణాలు కోల్పోయో ప్రమాదం ఉంటుంది.