ప్రజారోగ్యాన్ని కేసీఆర్ గాలికొదిలేశారు.. రాములమ్మ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా విషయంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ… రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించిన ఆమె.. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని దుయ్యబట్టారు… పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని మండిపడ్డారు. ఇక, కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా… ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో జరగబోతున్న “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష”ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుంది.. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు రాములమ్మ… తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే.. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోలదంటూ ట్వీట్లు చేశారు.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!