ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,63,533కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 33,53,765 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4329 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,78,719కి చేరింది.